నాగచైతన్యతో విడాకుల వ్యవహారంలో బాగా నలిగిపోయింది సమంత. దానికి తోడు.. తనపై వ్యతిరేక వార్తలు, గాసిప్పులు పుట్టిస్తున్న యూ ట్యూబ్ ఛానళ్లపై కోర్టుకెక్కింది. అదో తలనొప్పి. వీటి మధ్య.. కూడా తన కెరీర్ పైగా గట్టిగానే ఫోకస్ చేయాలని ఫిక్సయ్యింది. ఆ మధ్య కొత్త సినిమాలు ఒప్పుకునే విషయంలో చాలా జాప్యం చేసింది సమంత. ఎప్పుడైతే చైతూతో విడిపోయిందో, అప్పుడు సినిమా ఎంపికల విషయంలో జోరు చూపించడం మొదలెట్టింది. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు ఒప్పుకుంది.
ఇప్పుడు ఓటీటీపై దృష్టి పెట్టిందట. తక్కువ రోజుల కాల్షీట్లు, ఎక్కువ పారితోషికం వచ్చే ప్రాజెక్టులపై తను ఫోకస్ పెంచిందని టాక్. ఓటీటీ వ్యాపారం ఎలా ఉంటుందంటే.. తక్కువ శ్రమతో, ఎక్కువ పారితోషికం లాగేయొచ్చు. ఓటీటీ కోసం ఓ సినిమాప్లాన్ చేస్తే... 20, 30 రోజుల కాల్షీట్లతో సినిమా పూర్తవుతుంది. ఓ సినిమా కంటే ఎక్కువ పారితోషికం వస్తుంది. ఇదే గేమ్ ప్లాన్ తో ఇప్పుడు రెండు వెబ్ మూవీలను సమంత ఒప్పుకుందని టాక్. అంటే సమంత చేతిలో రెండు పెద్ద సినిమాలతో పాటుగా, రెండు వెబ్ మూవీలూ చేరిపోయాయన్నమాట. అంటే... 2022 వరకూ సమంత వెనక్కి తిరిగి చూసుకునే పనిలేదన్నమాట.