టాలీవుడ్‌ని కుదిపేస్తున్న శ్రీరెడ్డి వివాదం పవన్‌ని తాకడంతో, ఇండస్ట్రీ ప్రముఖులతో పాట, సామాన్య జనం కూడా తమ గళం విప్పుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు జోక్యంతో ఇండస్ట్రీ నుండి చాలా మంది పవన్‌కి సపోర్ట్‌గా, శ్రీరెడ్డికి వ్యతిరేకంగా తమ తమ శైలిలో స్పందిస్తున్నారు. కొందరైతే పోలీసు కేసులదాకా వెళ్లారు.
తాజాగా అల్లు అరవింద్ కూడా ఈ విషయంలో స్పందించారు. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి తీరును, చేయించానని మీడియా ముందుకు వచ్చి తప్పు ఒప్పుకున్న వర్మ తీరును దుయ్యబడుతూ సాయంత్రం ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్‌లో అల్లు అరవింద్ దర్శకుడు ఆర్జీవీని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
శ్రీ రెడ్డి తనని ఆర్జీవీ నే పవన్ కళ్యాణ్ తిట్టేలా ప్రోత్సహించాడు అని చెప్పేలోపే తెలివిగా వర్మ తానే ఈ మొత్తానికి సూత్రధారిని అని ఒక వీడియో విడుదల చేయడం ఆయన అతితెలివితేటలకి అద్దం పడుతుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఇటువంటి చర్యకి పాల్పడినందుకు వర్మపైన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎటువంటి శిక్ష వేస్తుందో పరిశ్రమనే నిర్ణయించాలి అని చెప్పాడు.
ఖచ్చితంగా వర్మని టార్గెట్ చేస్తూనే ప్రెస్ మీట్ ఉంటుందని కొందరు భావించినా ఆయన ఈ స్థాయిలో టార్గెట్ చేస్తారు అని ఎవరు కూడా ఊహించలేదు. అసలు వర్మకి ఎందుకు మెగా ఫ్యామిలీపై అంత కక్ష్య. ఏదో ఒక రకంగా మెగా ఫ్యామిలీని ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ని బదనం చేసేందుకు వర్మ ప్రయత్నిస్తూనే ఉంటాడు. తన ట్వీట్స్‌తో ఏదో ఒక రకంగా మెగా ఫ్యామిలీని, మెగా అభిమానుల్ని హర్ట్ చేస్తూనే ఉంటాడు.
కానీ ఈ సారి వర్మ, శ్రీరెడ్డిని పావులా వాడుకుని చేయించిన రచ్చతో వర్మ తన వేలితో తానే పొడుచుకున్నట్లైంది. శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ యవ్వారం కాస్తా, ఇప్పుడు వర్మ మెడకు బిగుసుకున్న ఉచ్చులా మారింది.