సంచలనాలకి కేంద్ర బిందువుగా మారిన శ్రీ రెడ్డి నిన్న రాత్రి తన ఇంటిలో ఆత్మహత్యకి పాల్పడినట్టుగా సమాచారం.
తెలియవస్తున్న వివరాల ప్రకారం, తాజాగా జరుగుతున్న పరిణామాల నేపధ్యంలో మానసికంగా వేదనకి గురై శ్రీ రెడ్డి నిన్న రాత్రి ఆమె ఇంటిలో ఆత్మహత్యకి పాల్పడిందట. అయితే ఆమె అప్పటికే చాలా నిరుత్సాహంగా అదే విధంగా మానసికంగా కూడా దృడంగా లేకపోవడంతో ఆమె ఇంటికి వచ్చిన మహిళా సంఘం వారు శ్రీ రెడ్డి ప్రయత్నాన్ని ఆపేశారట.
ఇక ఇలా ఒంటరిగా ఉంచడం మంచిది కాదు అని శ్రీ రెడ్డిని తమవెంట తీసుకువెళ్ళినట్టుగా తెలిసింది. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నది అన్న విషయం తెలియరాలేదు. అయితే ఇంకొంతమంది మాత్రం ఇవ్వన్ని కేవలం కొందరు కావాలని సృష్టిస్తున్న ప్రచారాలు, ఆమె పైన పోయిన సానుభూతిని ఇలా పెంచడానికే ప్రయత్నిస్తున్నారు అని అభిప్రయాపడుతున్నారు.
ఏదేమైనా.. శ్రీ రెడ్డి పేరు చెబితేనే ఒక వార్త అయ్యే పరిస్థితి వచ్చింది...