బన్నీ సినిమాకి సాలిడ్‌ విలన్‌ దొరికాడబ్బా!

By iQlikMovies - July 06, 2019 - 08:00 AM IST

మరిన్ని వార్తలు

'జై' సినిమాతో టాలీవుడ్‌కి కొత్త హీరో దొరికాడు. అందగాడు. మంచి నటుడు. అమ్మాయిలకు తెగ నచ్చేశాడు. అబ్బాయిలకు భలే ముచ్చటేసుకొచ్చాడు. ఆయన ఎవరో కాదు.. యంగ్‌ హీరో నవదీప్‌. తొలి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత హీరోగా పలు చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని సక్సెస్‌లూ అందుకున్నాడు. అయితే, ఆ తర్వాత చాలా స్లో అయిపోయాడు.

 

హీరోగా అవకాశాలు కొరవవడంతో బుల్లితెరపై స్పెషల్‌ రియాల్టీ ప్రోగ్రాంస్‌తోనూ మనోడు సందడి చేశాడు. ఆ తర్వాత మళ్లీ పెద్ద స్క్రీన్‌పై అవకాశాలు వచ్చాయి. కానీ, ఈ సారి హీరో అవకాశాలు రాలేదు మనోడికి. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కొన్ని సినిమాల్లో నటించాడు. నవదీప్‌ నటించిన లాస్ట్‌ మూవీ 'ధృవ'. మెగా పవర్‌స్టార్‌కి ఫ్రెండ్‌గా ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించాడు ఆ సినిమాలో. దాంతో నవదీప్‌కి వరుస అవకాశాలు పోటెత్తుతాయని భావించారు. కానీ జరగలేదు. తర్వాత మళ్లీ బిగ్‌బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక తాజాగా నవదీప్‌కి మరో బంపర్‌ ఛాన్స్‌ తగిలినట్లు న్యూస్‌ ఒకటి లీకయ్యింది.

 

ఈ లీక్డ్‌ న్యూస్‌లో రియాల్టీ ఎంతో కానీ, ఆ క్రమంలో ఓ పిక్‌ కూడా బయటికి వచ్చింది. ఆ పిక్‌కి మాత్రం రెస్పాన్స్‌ వీర లెవల్లో వచ్చేస్తోంది. మనోడు ఎప్పుడూ ఫిట్‌నెస్‌కి పెట్టింది పేరు. కానీ, ఈ తాజా పిక్స్‌లో నవదీప్‌ లుక్స్‌ చూస్తుంటే అబ్బో టాలీవుడ్‌ కండలవీరుడు ఇతనే అనిపించేలా ఉంది. ఇంతకీ ఈ లుక్స్‌ ఎవరి కోసం అంటే.. బన్నీ కోసమనే సమాచారం ఉంది. ఆగండాగండి.. డబుల్‌ మీనింగ్స్‌ తీసేయకండి. ఇట్స్‌ మీన్స్‌ బన్నీ తాజా చిత్రంలో నవదీప్‌ విలన్‌ అవతారమెత్తబోతున్నాడట. అందుకే ఈ కండల అవతారమనీ తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బన్నీకి సాలిడ్‌ విలన్‌ దొరికినట్లే మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS