ఇలియానాని బెల్లీ బ్యూటీ అని అంటుంటాం. నాజూకు నడుము విషయంలో ఇలియానాతో పోటీ పడే హీరోయిన్ ఇంకొకరు లేరనడం అతిశయోక్తి కాదేమో. ఆ స్థాయిలో ఇలియానా తన నడుము అందాన్ని సినిమా సినిమాకీ పెంచుకుంటూ పోతోంది. ఈ బ్యూటీ తెలుగులో సినిమాలేమీ చెయ్యడంలేదిప్పుడు. బాలీవుడ్‌లో మాత్రం వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. ఇలియానా నడుము గ్లామర్ గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ, ఇలియానాకి చీరకట్టు అయినా మోడ్రన్ డ్రస్సులైనా బాగా సూట్ అవుతాయనీ, చీరలో ఇలియానా చాలా స్పెషల్‌గా ఉంటుందని చెప్పాడు. అల్లు అర్జున్‌తో నటించిన హీరోయిన్లలో ఏ హీరోయిన్‌కి ఏ కాస్ట్యూమ్ సూట్ అవుతుందన్న ప్రశ్న వచ్చినప్పుడు ఆయన ఇలియానాకి చీరకట్టు, మోడ్రన్ లుక్ రెండూ బాగుంటాయని అన్నాడు. చీరకట్టులో ఇలియానా అంత అందంగా ఉండటానికి కారణం ఆమె నడుమేనని చెప్పాడు. సరైన ఒంపుతో ఉండే ఆ నడుము చీరకట్టుకి ప్రత్యేకమైన అందాన్ని తెస్తాయని అన్నాడు అల్లు అర్జున్. శృతిహాసన్ రాక్ స్టయిల్‌లో బాగుంటుందని, 'డిజె దువ్వాడ జగన్నాథమ్' ఫేం పూజా హెగ్దే షార్ట్ డ్రెస్‌లో బాగుంటాయని, ఆమెకు లాంగ్ లెగ్స్ పెద్ద ప్లస్ పాయింట్ అని అల్లు అర్జున్ వివరించాడు. తనతో పనిచేసిన హీరోయిన్లని ఇంత క్లోజ్‌గా అల్లు అర్జున్ అబ్జర్వ్ చేయడం గొప్ప విషయమే కదా.