మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో అనగానే ఆడియన్స్ కి పూనకాలే. వీరి సినిమాలు హ్యాట్రిక్ కొట్టిన సంగతి తెలిసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠ పురం వేటికవే ప్రత్యేకం. ఈ సినిమాల్లో బన్నీ యాక్టింగ్ స్టైల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ క్రేజీ కాంబో నాలుగోసారి మళ్ళీ రానుంది. ఈ మధ్య త్రివిక్రమ్ మహేష్ తో తీసిన గుంటూరు కారం ఫ్లాప్ అవటం తో బన్నీ వెనక్కి తగ్గాడని రూమర్లు వచ్చాయి. దీనితో సందిగ్ధంలో పడ్డారు ఫాన్స్. అసలు వీరి కలయికలో మూవీ ఉంటుందా? పోస్ట్ ఫోన్ అయ్యిందా అని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ కి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. త్రివిక్రమ్ బన్నీ మూవీ కన్ఫర్మ్ అని. అంతే కాదు ఈ మూవీలో బన్నీతో తెలంగాణ మాండలికంలో మాట్లాడించనున్నారని సమాచారం. పుష్పలో రాయలసీమ మాండలికంలో మెప్పించిన బన్నీ ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలో తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్పనున్నాడట. రుద్రమదేవి సినిమాలో తెలంగాణ మాండలికంలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పి అలరించిన బన్నీ ఈ సారి పూర్తి స్థాయిలో తెలంగాణ పోరడిగా మారనున్నాడు.
ఈ సినిమాకి సంభందించిన మరిన్ని డీటెయిల్స్ అధికారికంగా త్వరలో వెల్లడించనున్నారని తెలుస్తోంది. 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. బన్నీ త్రివిక్రమ్ కాంబో ఈ సారి ఎలాంటి మేజిక్ చేయనుందో చూడాలి.