దుల్కర్ సాల్మన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన అద్భుత దృశ్య కావ్యం సీతారామం ఈ మూవీ హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కింది. ఈ సినిమా సినీ ప్రియుల్ని అలరించిన సంగతి తెలిసందే. మణి రత్నం డైరక్ట్ చేసిన గీతాంజలి సినిమా తరువాత క్లాసికల్ హిట్ గా నిలిచింది సీతారామం. ఇంపార్టెంట్ రోల్ లో రష్మిక మందన్న కూడా నటించింది. రామ్ గా దుల్కర్, నూర్జహాన్ పాత్రలో మృణాల్ ప్రేక్షకుల్ని కట్టి పడేసారు. కథతో పాటు విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం కూడా ఈ సినిమాని మరో స్థాయిలో నిలబెట్టింది. సీతారామం వెండితెర మీద చేసిన మ్యాజిక్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఈ మూవీకి సీక్వెల్ వస్తే బాగుణ్ణు అని ఆడియన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రియుల్ని అలరించే న్యూస్ ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది.
హను రాఘవపుడి కూడా సీతారాం 2 పై ఆసక్తిగా ఉన్నట్టు టాక్. ప్రభాస్ తో ఒక ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్న హను ఆ సినిమాకి కొంచెం టైం పడుతుండటంతో ఈలోగా సీతారామం 2 కథ పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. కానీ అసలు విషయం ఏంటి అంటే సీతారామం 2 ఉంటుంది కానీ సీతా, రామ్ కథ పూర్తి అయిపోయిన ఘట్టం. కానీ ఆడియన్స్ కోరిక మేరకు ఆ పాత్రలకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని, మరో కొత్త కథలో వారిద్దరిని భాగం చేసేలా ప్లాన్ చేస్తున్నారట హను. వారితోటే కొత్త కథ చెప్పి, ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేయనున్నారని తెలుస్తోంది.
ఏదైనా కానీ మళ్ళీ దుల్కర్, మృణాల్ జంటని చూడటానికి ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమాలో కూడా దుల్కర్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. కల్కి డైరక్టర్ నాగ అశ్విన్ తో మహానటి సినిమాలో వర్క్ చేసాడు దుల్కర్. దుల్కర్ నటించిన మహానటి, సీతారామం, కల్కి, అన్నీ వైజయంతి బ్యానర్ వే కావటం గమనార్హం.