అల్లు అర్జున్ నిన్న దాసరి పార్థివ శరీరాన్ని చూసేందుకు వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. అది చూసిన బన్నీ ఒక్కసారిగా కోప్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే, దాసరికి నివాళులు అర్పించి భయటకి వస్తున్న తరుణంలో అక్కడ గుమిగూడిన జనం లో కొంతమంది ఒక్కసారిగా DJ.. DJ.. అంటూ నినాదాలు చేసేసరికి బన్నీ కి కోపం వచ్చింది.
ఇక్కడ ఉన్న పరిస్థితికి అలా చేయడం తప్పు అంటూ వారిని ఉద్దేశించి సైగలు చేశాడు. దీనితో నినాదాలు చేస్తున్నవారు ఒక్కసారిగా అలెర్ట్ అయ్యారు.
ఏది ఏమైనప్పటికీ ఇలా ప్రవర్తించడం ఎవరికైనా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా సమన్వయంతో ఉండడం ఎంతవరకైనా అవసరం అని ఈ సంఘటన మరోసారి ఋజువు చేసింది.