టాలీవుడ్ లో మరో ఆసక్తికరమైన కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు విడుదలైంది. ఈ చిత్రాన్ని టి సిరీస్‌సంస్థ నిర్మిస్తోంది. గుల్షన్ కుమార్ నిర్మాత. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సందీప్‌రెడ్డి ప్రస్తుతం `యానిమల్` సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత ప్రభాస్ తో స్పిరిట్ తెరకెక్కుతుంది. స్పిరిట్ పూర్తయ్యాకే.. బన్నీ సినిమా మొదలవుతుంది.
సందీప్ రెడ్డి అల్లు అర్జున్‌కి పెద్ద ఫ్యాన్. అర్జున్ రెడ్డిలో అల్లు అర్జున్ ఉండి ఉంటే.. ఆ సినిమా వేరే రేంజ్‌లో ఉండేదని చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు తనకిష్టమైన హీరోతో సినిమా చేస్తున్నాడు. బన్నీ ప్రస్తుతం పుష్ప 2తో బిజీగా ఉన్నాడు. సందీప్‌రెడ్డి తో సినిమా చేయడానికి ముందు.. మరో సినిమా పూర్తి చేయొచ్చు. పుష్ప 2 తరవాత మరో సినిమా చేశాక.. అప్పుడు సందీప్ తో సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. అంటే ఈ కాంబో లో సినిమా మొదలవ్వడానికి మరో రెండేళ్లయినా పడుతుంది.