మెగా హీరోల మధ్య వ్యక్తిగత పోటీ లేనప్పటికీ తమతమ సినిమాల ద్వారా మాత్రం ఒకరితో ఒకరు పోటీ పడుతూనే ఉంటారు. తాజాగా అటువంటిదే రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్యన కూడా జరిగింది.
ఆ వివరాల్లోకి వెళితే, రామ్ చరణ్ రంగస్థలం చిత్రం నైజాం ఏరియా రైట్స్ సుమారు రూ 18 కోట్లకు అమ్ముడుపోగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా నైజాం రైట్స్ ఏకంగా రూ 21.5 కోట్లకు ఒక ప్రముఖ పంపిణిదారుడు దక్కించుకున్నాడు.
దీనితో నైజాం ఏరియాలో రామ్ చరణ్ ని వెనక్కి నెట్టి అల్లు అర్జున్ ముందుకెళ్ళిపోయాడు. అయితే దీనికి కారణం అల్లు అర్జున్ కి నైజాం లో గత చిత్రాలు బాగా వసూలు చేయడమే ఇంతటి క్రేజ్ కి కారణం అనిట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఇక రామ్ చరణ్ రంగస్థలం వచ్చే నెల 30వ తేదీని విడుదల అవుతుండగా అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఏప్రిల్ 27న విడుదల కానుంది. చూద్దాం.. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలకి ఎటువంటి ఆదరణ దక్కనుందో..