టాలీవుడ్, బాలీవుడ్ అనే గీతలు ఇప్పుడు చెరిగిపోయాయి. పాన్ ఇండియా మార్కెట్ ఎప్పుడైతే రెక్కలు విప్పుకొందో.. అప్పటి నుంచీ.. ఎవరైనా ఎక్కడైనా పాగా వేయగలరు అనే విషయం అర్థమైంది. ముఖ్యంగా తెలుగు హీరోలకు బాలీవుడ్ మార్కెట్ లో తలుపులు తెరచుకొన్నాయి. స్ట్రయిట్ గా హిందీ సినిమా చేయకపోయినా.. డబ్బింగ్ రూపంలో మన సినిమాలకు కాసుల వర్షం కురిపిస్తున్నారు. అల్లు అర్జున్ కూడా పుష్ప తో బాలవీఉడ్ లో తన ప్రభావం గట్టిగా చూపించాడు. నార్త్ లో పుష్ప దుమ్ము దులిపింది. ఇప్పుడు వాళ్లంతా పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బన్నీ నేరుగా ఓ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడని వార్తలొస్తున్నాయి.
డబ్బింగ్ సినిమా వేరు.. స్ట్రయిట్ సినిమా వేరు. నేరుగా హిందీలో ఓ సినిమా చేస్తే... అది హిట్టయితే.. ఆ గుర్తింపే వేరే లెవల్ లో ఉంటుంది. పైగా బన్నీ లాంటి హీరోల కోసం బాలీవుడ్ ఆశగా ఎదురు చూస్తోంది. వీళ్లు సినిమాలు చేయాలే గానీ, రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తారు. అందుకే బన్నీ కూడా ఆ దిశగా ఆలోచించడం మొదలెట్టాడు.
ఇటీవల సంజయ్ లీలా బన్సాలీ, బన్నీల మధ్య ఓ భేటీ జరిగింది. ఈ భేటీ సినిమా కోసం కాదని చెబుతున్నా.. సినిమాకు సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చాయని సమాచారం. బన్సాలీలాంటి దర్శకుడు సినిమా చేస్తానంటే... బన్నీ `నో` చెప్పడు. అయితే బన్సాలీకి ఆ ఉద్దేశం ఉందా, లేదా అనేది ప్రధానం. బన్సాలీ కాకపోయినా.. ఓ బాలీవుడ్ దర్శకుడితో బన్నీ త్వరలోనే జట్టు కడతాడని, అందుకు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయని ఓ టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది. పుష్ప 2 తరవాత.. బన్నీ సినిమా అదే కావొచ్చు.