జ‌గ్గూభాయ్‌... గుడ్ బాయ్‌!

మరిన్ని వార్తలు

జ‌గ‌ప‌తిబాబు జీవితం తెర‌చిన పుస్త‌కం. హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ని ఆక‌ట్టుకొన్నారు. హీరోగా త‌న కెరీర్ డౌన్ ఫాల్ లో ఉండ‌గానే, విల‌న్ గా మారి... కొత్త ఇన్నింగ్స్ కి శ్రీ‌కారం చుట్టారు. అక్క‌డి నుంచి జ‌గ్గూభాయ్ జైత్ర‌యాత్ర సాగుతూనే ఉంది. బ‌డా హీరోల సినిమాలో విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి పాత్ర‌లు ప‌డుతున్నాయి. హీరోగా ఎంత సంపాదించారో తెలీదు గానీ, సెకండ్ ఇన్నింగ్స్‌లోనే ఆయ‌న ఆర్థికంగా సెటిల్ అయ్యార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతుంటాయి. జ‌గ‌ప‌తిబాబు కూడా ఇదే మాట చెబుతుంటారు. అయితే ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు ఓ అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకొన్నార‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఆయ‌న త్వ‌ర‌లోనే న‌ట‌న‌కు గుడ్ బాయ్ చెప్ప‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా ప్ర‌క‌టించ‌లేదు గానీ, `న‌ట‌న మానేద్దామ‌నుకుంటున్నా` అని స‌న్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

 

అయితే.. నిర్మాత‌గా మారి, సినిమాలు చేయాల‌న్న ప్లాన్ లో ఉన్నార్ట‌. జ‌గ‌ప‌తిబాబు ఇప్పుడు సింపుల్ లైఫ్ గ‌డ‌ప‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. హైద‌రాబాద్ కి దూరంగా ఉన్న ఫామ్ హౌస్‌లోనే ఎక్కువ‌గా గ‌డుపుతున్నారు.

 

ఈమ‌ధ్య కాలంలో ఆయ‌న ద‌గ్గ‌ర‌కు క‌థ‌లు వెళ్తున్నా, తిప్పి కొడుతున్నార‌ని స‌మాచారం. చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, ఆ త‌ర‌వాత ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌ప‌డాల‌ని అనుకుంటున్నార్ట‌. అయితే ఇది నిజ‌మా, కేవ‌లం గాసిప్పేనా... అనేది జ‌గ్గూభాయ్ పెద‌వి విప్పితే గానీ తెలీదు. ఏ విష‌యంలో అయినా దాప‌రికం లేకుండా స్ట్ర‌యిట్‌గా మాట్లాడే జ‌గ‌ప‌తిబాబు... ఈ విష‌యాన్ని ర‌హ‌స్యంగా ఉంచుతార‌ని ఎవ్వ‌రూ అనుకోవ‌డం లేదు. త్వ‌ర‌లోనే.. రిటైర్‌మెంట్ పై జ‌గ‌ప‌తి స్పందించే అవ‌కాశం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS