స్టైలిష్ స్టార్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ లో హ్యాట్రిక్ కొట్టాడు. వరుసగా మూడు సంవత్సరాలుగా ఈ అవార్డులు పొందాడు- రేస్ గుర్రం (2014), రుద్రమదేవి (2015), సరైనోడు (2016).
అయితే ఈ సంవత్సరం వచ్చిన అవార్డుని ఈ మధ్యనే పరమపదించిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి అంకితం ఇస్తునట్టు ప్రకటించాడు. అవార్డు తీసుకున్న సందర్భంలో ఈ విషయాన్ని ప్రకటించి అందరిచేత ఒక నిమిషం పాటు ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటింపచేశాడు.
దీనితో అక్కడ ఉన్న ప్రతిఒక్కరు బన్నీని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. మొత్తానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పనిని అందరు అభినందిస్తున్నారు.