కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన సినీ జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలియవస్తుంది.
తెలియస్తున్న వివరాల ప్రకారం, విష్ణు నటించబోతున్న ‘కన్నప్ప’ చిత్రానికి మోహన్ బాబు దర్శకత్వం వహిస్తే ఎలా ఉంటుంది అనే అంశాన్ని పరిశీలిస్తున్నారట! ఇప్పటికే ఈ చిత్రాన్ని మంచు ఫ్యామిలీ తమ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు.
అయితే ఈ చిత్రానికి కథ ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన తనికెళ్ళ భరణి అందించనున్న విషయం విదితమే. చూద్దాం.. మరి మోహన్ బాబు ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రానికి మెగా ఫోన్ పడతారో లేదో!!
ఒక వేళ డైరెక్షన్ చేస్తే గనుక, తండ్రుల డైరెక్షన్ లో నటించిన కొడుకుల క్లబ్ లో వీరు కూడా చేరిపోతారు.