'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమా లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రస్తుతానికి మిక్స్‌డ్ టాక్ సంపాదించింది. అయినా కానీ భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి 'డీజె'కి. ఈ వారంలో వరుసగా సెలవులు కలిసి రావడంతో వసూళ్ల విషయంలో ఢోకా ఉండదని చిత్ర యూనిట్ భావిస్తోంది. అనుకున్న అంచనాలను 'డీజె' సాధిస్తాడనే నమ్మకం లేకపోలేదు. ఓవర్సీస్‌లో అయితే 'డీజె' దూకుడు మీదే ఉంది. అక్కడ 300 స్క్రీన్స్‌పై ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. 'బాహుబలి' తర్వాత వచ్చిన పెద్ద సినిమా 'డీజె'. సో ఆడియన్స్ ఈ సినిమాపై ఆశక్తిగానే ఉన్నారు. టాక్‌తో సంబంధం లేకుండా, ధియేటర్లకు వచ్చి, సినిమా చూసే అవకాశాలున్నాయి. దిల్ రాజు మార్కెటింగ్ స్కిల్స్ ఈ సినిమాకి బాగా కలిసొచ్చేలా ఉన్నాయి. అల్లు అర్జున్ - పూజా హెగ్దే జంటగా వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్దే హాట్ అప్పీల్ ప్రత్యేకించి కుర్రకారును ధియేటర్స్‌కి రప్పిస్తోంది. అలాగే బన్నీ ఇంతవరకూ నటించని స్పెషల్ క్యారెక్టర్ ఇది. పేరుకు బ్రాహ్మణ గెటపే అయినా కానీ ఏమాత్రం తగ్గని ఎనర్జీ లెవల్స్‌తో పిచ్చెక్కిస్తున్నాడు బన్నీ. డాన్సులు, ఫైట్లు ఇరగదీసేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందింది ఈ సినిమా. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇప్పటికే అలరిస్తుండగా, విజువల్‌గా సాంగ్స్ కంపోజేషన్ కూడా అందర్నీ బాగా ఆకర్షిస్తోంది. ఈ వారం గడిస్తే కానీ దువ్వాడ సత్తా ఏంటనేది తేల్చలేము. మొత్తానికి ఈ సారి గట్టిగా కొట్టేస్తాం అన్న బన్నీ డైలాగ్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలిక.