దిల్ రాజు అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్ . దిల్ రాజు కెరియర్ లో ఓటమి అంటే తెలియకుండా కొనసాగుతున్నారు. ఎక్కువ సక్సెస్ రేటు ఉంది దిల్ రాజుకి. అలాంటి దిల్ రాజు ఈమధ్య కొంచెం తడబడ్డాడు. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్న దిల్ రాజు ఇపుడు పోటీలో లేకుండా పోయారు. నిన్న కాక మొన్న వచ్చిన కొత్త నిర్మాణ సంస్థలు జోరుగా ఉన్నాయి. వరుస పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కిస్తూ హిట్లతో లాభాలు గడిస్తున్నాయి. ఈ మధ్య దిల్ రాజు లెక్కలు స్ట్రాటజీ ఏం కలిసి రావటం లేదు.
దిల్ రాజు సంక్రాంతికి మూడు సినిమాలతో బరిలో దిగారు. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు తానే నిర్మాత కాగా డాకు మహారాజు నైజాం డిస్ట్రిబ్యూటర్. వీటిలో గేమ్ చెంజర్ ఒక్కటే నిరాశ పరిచింది. గేమ్ చెంజర్ తో కోలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చిన దిల్ రాజుకు నిరాశ ఎదురయ్యింది. ఇలాంటి టైంలో మంచి మార్కెట్ ఉన్న బన్నీ దిల్ రాజు కి భరోసా ఇచ్చాడట. పుష్ప 2 తర్వాత బన్నీ మార్కెట్ రేంజ్ పెరిగింది. బన్నీ పై రూపాయి పెడితే నాలుగు రూపాయలు తెచ్చేలా ఉన్నాడు. ప్రజంట్ ఆర్ధికంగా వెనకపడిన దిల్ రాజు కి బన్నీ సపోర్ట్ చేసేలా ఒక ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.
పైగా వీరిద్దరిది సూపర్ హిట్ కాంబో. గతంలో బన్నీ - దిల్ రాజు కాంబోలో ఆర్య, పరుగు, డీజే సినిమాలు కమర్షియల్ గా హిట్ సాధించి దిల్ రాజుకు లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో మళ్ళీ దిల్ రాజు తో బన్నీ వర్క్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. తాజాగా బన్నీ దిల్ రాజు భేటీ జరిగింది అని, ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యింది అని టాక్. కాకపొతే అట్లీ, త్రివిక్రమ్ సినిమాలు తరవాత దిల్ రాజు బన్నీ కాంబో ఉంటుందని సమాచారం. సుమారు 2027లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కవచ్చు అని అంచనా వేస్తున్నారు.