పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. నేషనల్ అవార్డుతో పాటు, పాన్ వరల్డ్ స్టార్ ని చేసింది. పుష్ప 2 తరవాత బన్నీ చేయబోయే సినిమా ఏంటని అందరిలో ఆత్రుత పెరిగింది. కచ్చితంగా ఇక నుంచి బన్నీ చేయబోయే సినిమాలపై పాన్ వరల్డ్ ఫాన్స్ ద్రుష్టి ఉంటుంది. బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ స్టార్ట్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇంకా వర్క్ జరుగుతోంది అని ఈ లోగా అట్లీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్నీ. అట్లీ కూడా జవాన్ మూవీ తరువాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావటంతో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
పుష్ప 2 మూవీకి సుమారు 500 కోట్లు బడ్జెట్ పెడితే 1900 కోట్లు వసూల్ చేసింది. పుష్ప 2 మూవీతో బన్నీ మార్కెట్ అమాంతం పెరిగింది. అట్లీ బాలీవుడ్ డెబ్యూ జవాన్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. వేలల్లో మార్కెట్ ఉన్నబన్నీ - అట్లీ కాంబో అంటే ఇక చెప్పేదేం లేదు రఫా రఫా కోతే. అందుకే అట్లీ బన్నీ కాంబో మూవీకి బడ్జెట్ కూడా భారీగానే ఉంది. ఈ మూవీ కోసం సుమారు 600 కోట్ల బడ్జెట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. బన్నీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే ఇంత బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఈ బడ్జెట్ లో సగం కేవలం బన్నీ, అట్లీ పేమెంట్ ఉందని టాక్. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 250 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ ని బన్నీ అధిగమించినట్లే. ఇప్పటివరకు హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ గా ప్రభాస్ ఉండేవాడు. ఇప్పుడు ఆ లిస్ట్ లో బన్నీ చేరాడు. అట్లీ కూడా ఈ మూవీ కోసం 100 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా వీరిద్దరి పేమెంట్ కే సగం బడ్జెట్ ఖతం.