ఎంసీఏ తరవాత వేణు శ్రీరామ్... ఐకాన్ అనే కథ రాసుకోవడం, అల్లు అర్జున్ కి వినిపించడం, ఆయన ఓకే చెప్పేయడం తెలిసిన విషయాలే. అయితే.. ఎందుకనో ఆ తరవాత ఈ ప్రాజెక్టుని అల్లు అర్జున్ పక్కన పెట్టేశాడు. వకీల్ సాబ్ హిట్టవ్వడంతో... వేణు శ్రీరామ్ కెరీర్ మలుపు తిరిగినట్టైంది. ఇప్పుడు తనపై భరోసా తప్పకుండా పెరుగుతుంది. దిల్ రాజు కూడా `ఐకాన్` తీస్తాం.. అని డిక్లేర్ చేశారు. బన్నీ ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడే ఈ సినిమా పట్టాలెక్కుతుందని ప్రకటించారు.
అయితే... ఒకవేళ బన్నీ కాదన్నా.. దిల్ రాజు దగ్గర మరో ఆప్షన్ ఉందట. ఈ కథని మరో స్టార్ హీరోతో అయినా పట్టాలెక్కిద్దామని దిల్ రాజు భావిస్తున్నాడట. ఆయన లిస్టులో ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. `ఐకాన్`లో పాన్ ఇండియా ప్రాజెక్టుకి కావల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయట. పాన్ ఇండియా కథంటే ముందుగా గుర్తొచ్చేది ప్రభాస్ మాత్రమే. అందుకే.. ఈ కథని ప్రభాస్ కి వినిపించాలని డిసైడ్ అయినట్టు టాక్.