ఈ రోజు కేరళలో జరగనున్న 'నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్' పోటీలకు స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని కేరళ ప్రభుత్వం ముఖ్య అతిధిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అక్కడ అల్లు అర్జున్‌కి టాలీవుడ్‌కి సమానమైన ఫాలోయింగ్ ఉంది. అల్లు అర్జున్ సినిమాలు అక్కడ సూపర్ డూపర్ హిట్స్ అందుకోవడంతో పాటు, భారీ వసూళ్లు కొల్లగొడుతుంటాయి.
అల్లు అర్జున్‌ని అక్కడ అభిమానులు మల్లు అర్జున్ అంటూ ముద్దుగా పిలచుకుంటారు. ఈ రోజు జరగబోయే బోట్ రేసింగ్ పోటీలకు అల్లు అర్జున్ తన సతీమణి స్నేహారెడ్డితో కలిసి కేరళకు వెళ్లారు. కేరళ ప్రజలు అల్లు అర్జున్‌కి ఘన స్వాగతం పలికారు. మల్లు అర్జున్‌కి ఘన స్వాగతం అంటూ భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టు నుండే అల్లు అర్జున్‌కి అభిమానులు సాదర స్వాగతం పలికారు. అభిమానుల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. అదీ కేరళలో అల్లు అర్జున్ స్టామినా.
ఇటీవల కేరళ వరద బాధితుల సహాయార్ధం అల్లు అర్జున్ 25 లక్షలు విరాళం ప్రకటించి అక్కడి ప్రజల మనసుల్ని మరింత దోచుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమాకి సిద్ధమవుతున్నాడు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఇది.
త్వరలో ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుంది.