ఎన్టీఆర్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా `ఊసరవెల్లి`. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా అనుకొన్నంత స్థాయిలో ఆడలేదు. కానీ ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లలో అల్లు అర్జున్ ఒకడు. ఈ సినిమా కథ.. బన్నీకి చాలా ఇష్టం. అందులోనూ హీరో క్యారెక్టర్ అంటే మరీ ఇష్టం. కాస్త రీ వర్క్ చేసి, ఈ సినిమా తీస్తే అదిరిపోతుందన్నది బన్నీ ఫీలింగ్. అలా ఈ కథపై మళ్లీ వర్క్ చేస్తే, తానే హీరోగా నటిస్తానని అన్నాడట. ఈ విషయం `ఊసరవెల్లి` కథా రచయిత వక్కంతం వంశీ తెలిపారు.
``ఊసరవెల్లి, కిక్ 2లు సరిగా ఆడలేదు. కానీ ఈ రెండు కథలకు బన్నీ ఫ్యాన్. రీ వర్క్ చేసి, తీస్తే.. ఈ సినిమాలు బాగా ఆడతాయని గట్టిగా నమ్ముతారు. ఎప్పటికైనా ఈ సినిమాలు చేస్తా అని నాతో చెప్పారు..`` అని వంశీ గుర్తు చేసుకొన్నారు. అల్లు అర్జున్ - వంశీ కాంబినేషన్‌లో `నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా` సినిమా వచ్చింది. అది కూడా సరిగా ఆడలేదు. ఆ సినిమా ఆడి ఉంటే... `ఊసరవెల్లి 2` బన్నీతోనే వచ్చి ఉండేదేమో..? వక్కంతం వంశీ ఇప్పుడు నితిన్ తో `జూనియర్` అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.