'హిట్' తో పేరుకి తగ్గట్టే హిట్టు కొట్టాడు నాని. నిర్మాతగా నానికి అన్ని విధాలా సంతృప్తికరమైన ఫలితాన్ని అందించిన చిత్రమది. అందుకే `హిట్ 2` తీసేశాడు. హిట్ 1లో విశ్వక్‌సేన్ హీరో అయితే, హిట్ 2 లో... అడవిశేష్ హీరోగా కనిపించాడు. ఈ పరంపర ఇక్కడితో ఆగడం లేదట. హిట్ 3, 4, 5, 6, 7. 8 కూడా రాబోతోందని... వాటికి సంబంధించిన లైన్స్ అన్నీ.. అడవిశేష్ దగ్గర సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. హిట్ 3 స్క్రిప్టు ఎప్పుడో సిద్ధమైపోయిందని టాక్. అయితే ఇది భారీ మల్టీస్టారర్ గా రూపుదిద్దుకోనుందని టాక్. ఈ సినిమాలో విశ్వక్, అడవిశేష్ లతో పాటు.. విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. హిట్ 4, 5, 6, 7 లలో హీరోలు మారుతుంటార్ట. ఆఖరి భాగంలో అంటే.. హిట్ 8లో.... ఆ హీరోలంతా కలిసి కనిపించనున్నార్ట. ఇదంతా ప్లాన్ మాత్రమే. హిట్ 3 హిట్టయితేనే మిగిలిన భాగాలు వస్తుంటాయి. ఎక్కడ ఫ్లాప్ అయితే... అక్కడ ఈ పరంపరకు పుల్ స్టాప్ పడిపోతుంది. కాకపోతే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కు మంచి గిరాకీ ఉంటుంది. నాని కూడా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. కాబట్టి.... ఈ పరంపర ఇలానే కొనసాగే ఛాన్సు ఉంది. హిట్ కథకు 8 భాగాలు వస్తే.. అది నిజంగా.. ప్రపంచ రికార్డుగా మిగిలిపోతుంది.