బ‌న్నీ సినిమా ప‌క్క‌కు వెళ్లిపోయిన‌ట్టేనా?

మరిన్ని వార్తలు

చిత్ర‌సీమ‌లో ఎప్పుడూ అనుకోనివే జ‌రుగుతుంటాయి. అన్నీ సెట్...అంతా సెట్ అనుకున్న సినిమాలు ప‌క్క‌కు వెళ్లిపోతుంటే, `ఇప్పుడు కుద‌ర‌దేమో` అనే ప్రాజెక్టులు స‌డ‌న్ గా ప‌ట్టాలెక్కుతుంటాయి. ఎన్టీఆర్ - కొర‌టాల కాంబినేష‌న్ కూడా అంతే. `ఆర్‌.ఆర్‌.ఆర్` త‌ర‌వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ తో సినిమా చేయాలి. ఆ త‌ర‌వాత కూడా రెండు మూడు ప్రాజెక్టులు ఓకే. అందులో కొర‌టాల శివ పేరు లేదు. కానీ స‌డ‌న్ గా కొర‌టాల సినిమా పేరు వ‌చ్చి చేరింది. ఆయ‌న‌తో సినిమానే ముందు ప‌ట్టాలెక్కుతుంది.

 

ఎన్టీఆర్ - కొర‌టాల సినిమా జూన్ రెండో వారంలో మొద‌ల‌వుతుంది. అయితే నిజానికి కొర‌టాల ప్లానింగ్స్ వేరు. ఆచార్య త‌ర‌వాత‌.. అల్లు అర్జున్ తో కొర‌టాల ఓ సినిమా చేయాలి. ఇందుకు సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా ఎప్పుడో వ‌చ్చేసింది. కాన్సెప్ట్ పోస్ట‌ర్ కూడా వ‌దిలారు. `పుష్ష‌` త‌ర‌వాత బ‌న్నీ సినిమా అదే. కానీ.. ఇప్పుడు ఆ స్థానంలోనే ఎన్టీఆర్ సినిమా మొద‌లెడుతున్నాడు కొర‌టాల‌. అంటే.. బ‌న్నీ సినిమా ప్ర‌స్తుతానికి లేన‌ట్టే. భ‌విష్య‌త్తులో అయినా ఉంటుందా, లేదా? అనేది అనుమానం. ఎందుకంటే బ‌న్నీ చేతిలోనూ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. మ‌ళ్లీ బ‌న్నీ - కొర‌టాల క‌ల‌యిక ఎప్పుడు కుదురుతుందో?


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS