నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ లీక్

By iQlikMovies - April 24, 2018 - 18:13 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇంకొక 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబందించిన కథ లీక్ అయిందంటూ ఒక వార్త ఇప్పుడు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నది.

ఇంతకి వైరల్ అవుతున్న ఆ కథ ఏంటంటే- స్వతహాగా కోపిష్టి అయిన హీరో తన చర్యల వల్ల చేస్తున్న మిలిటరీ ఆఫీసర్ ఉద్యోగం నుండి సస్పెండ్ అవుతాడు. ఇక మళ్ళీ ఆ సస్పెన్షన్ ఎత్తివేయాలంటే ఒక ప్రముఖ డాక్టర్ వద్ద నుండి తన మానసిక స్థితి సరిగ్గా ఉందని తెలియపరుస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తే అప్పుడే తన సస్పెన్షన్ తొలగించబడుతుంది.

మరి ఆ సర్టిఫికేట్ డాక్టర్ నుండి తీసుకుంటాడా? తిరిగి తన ఉద్యోగాన్ని తిరిగి తెచ్చుకుంటాడా లేదా అన్నది సినిమాలో తెలుస్తుందట. ఇది ఈ చిత్ర కథ అంటూ వైరల్ అవుతున్నది. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

ఈ మధ్యకాలంలో సినిమా విడుదలకి ముందే ఈ లీకులు సినిమా యూనిట్ ని తెగ ఇబ్బంది పెడుతున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS