బాలకృష్ణ పైన ఫైర్ అయిన సాయి కుమార్

By iQlikMovies - April 24, 2018 - 17:37 PM IST

మరిన్ని వార్తలు

నటసింహం బాలకృష్ణ ఈ మధ్యన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే.

ఇక ఆ వ్యాఖ్యల పైన పలువురు సెలబ్రిటీలు తమతమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ నటుడు సాయి కుమార్ కూడా ఈ అంశం పై మాట్లాడుతూ- ఎవ్వరి పైన కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం మంచిది కాదు అని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశాడు.

దీనితో ఇప్పుడు ఈ అంశం మరింత హైలైట్ గా మారింది. ఎందుకంటే- సాయి కుమార్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని బాగేపల్లి నియోజకవర్గం నుండి BJP తరపున పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మారే అవకాశం కూడా ఉన్నట్టు పొలిటికల్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి బాలకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS