అల్లు అర్జున్ తన సినిమాల కోసం ఎంత కష్టపడతాడో ఇప్పటికే మనం చాలా చిత్రాల్లో చూశాం. తాజాగా ఆయన కొత్త సినిమా నా పేరు సూర్య కోసం పడే కష్టం ఏంటో మరోసారి నిరూపణ అయింది.
ఆ వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' కోసం డార్జిలింగ్ లో షూటింగ్ చేస్తున్నాడు. అయితే చలికాలం అవ్వడంతో వీరు షూటింగ్ చేస్తున్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపుగా -12 డిగ్రీలకి పడిపోయినట్టు సమాచారం.
ఇంతటి చలిలో కూడా అల్లు అర్జున్ తన యూనిట్ తో కలిసి షూటింగ్ చేస్తున్నాడట. దీనికి కారణం సినిమాని వారు అనుకున్న సమయానికి విడుదల చేయాలనుకోవడమే. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులకి ఈ చిత్రం పైన అంచనాలని పదింతలు పెంచేలా ఉంది.
మరి అల్లు అర్జున్ పడుతున్న కష్టానికి తగ్గట్టుగా కొత్త దర్శకుడు వక్కంతం వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడా లేదా అనేది తెలియాలంటే ఈ చిత్రం విడుదల వరకు మనం ఆగాల్సిందే.