ప్రస్తుతం బ్రేక్ లో వున్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో పుష్ప: ది రూల్ చిత్రీకరణలో జాయిన్ కానున్నాడు. ఈ చిత్రం సెట్స్‌లో చేరడానికి ముందు బన్నీ కొత్త లుక్ బయటికి వచ్చింది. అవినాష్ గోవారికర్ తీసిన ఫోటోలో బన్నీ స్టైలిష్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పొడవాటి జుట్టు, ట్రిమ్ చేసిన గడ్డంతో వున్న బన్నీ లుక్ అలరిస్తుంది.
పుష్ప: ది రూల్ కోసం కొత్త లుక్ లో కనిపించనున్నారు బన్నీ. సుకుమార్ స్క్రిప్ట్ పూర్తి చేసి త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఈ సీక్వెల్ కోసం అల్లు అర్జున్ 100 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫహద్ ఫాసిల్, అనసూయ, సునీల్ పార్ట్ 2 లో కూడా కీలక పాత్రలు పోహిస్తున్నారు.