ప్రముఖ మలయాళ దర్శకుడు అల్లు అర్జున్‌తో సినిమా రూపొందించడానికి కథ రెడీ చేశాడట. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కించేందుకు ప్లాన్ చేశాడట. అల్లు అర్జున్‌కి మలయాళంలో పాపులారిటీ ఉన్న సంగతి తెలిసిందే. ఆ పాపులారిటీతో ఓ ఈవెంట్‌కి గెస్ట్‌గా ఇటీవల అల్లు అర్జున్ కేరళ వెళ్లాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కి కేరళలో అభిమానుల నుండి కనీ వినీ ఎరుగని రీతిలో వెల్‌కమ్ లభించింది. అప్పుడు ఆ దర్శకుడు కూడా అల్లు అర్జున్‌ని కలిశాడనీ సమాచారమ్.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇటు తెలుగులో తన కొత్త సినిమా విషయం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. విక్రమ్ కుమార్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ కావడంతో కథల ఎంపికలో పూర్తిగా కన్‌ప్యూజ్ అవుతున్నాడు అల్లు అర్జున్. మరోవైపు ఫ్యాన్స్ నుండి అతనిపై తీవ్ర ఒత్తిడి కూడా నెలకొంది. ఇటీవల 'అరవింద సమేత' చిత్రం విజయంతో త్రివిక్రమ్‌తో అల్లు అర్జున్ సినిమా దాదాపు ఖరారైనట్లే అని ప్రచారం జరిగింది.
కానీ ఈ విషయంలో ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో మలయాళం నుండి ఆఫర్ అంటే అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.? అందులోనూ మలయాళ సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ ఉంటాయి. అయినా ఏదో ఒక స్టెప్ తొందరగా వేస్తాడా.? లేక మరి కాస్త టైం తీసుకుని ఆలోచిస్తాడా.? బన్నీ చూడాలిక.