ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప2 తరవాత మరింత పెరిగింది. బన్నీ ఇపుడు నేషనల్ స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. కాకపోతే సంధ్యా ధియేటర్ ఘటన కారణంగా పుష్ప 2 మూవీ ఇచ్చిన కిక్ ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. హాలిడే బ్రేక్ కూడా తీసుకోలేదు. ప్రస్తుతం బన్నీ ఆ ఘటన నుంచి తేరుకున్నాడు. కోర్టు కూడా నార్మల్ బెయిల్ జారీ చేసి, షరతులు తొలగించింది. దీంతో మళ్ళీ ఫుల్ జోష్ లో కొత్త కథలు విని ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. బన్నీ సినిమాలన్నీ పుష్ప వరకు ఒక లెక్క, పుష్ప తరువాత ఒక లెక్క అన్నట్టు మారాయి. ఇక నుంచి బన్నీ నుంచి రానున్నవి పాన్ ఇండియా సినిమాలే.
దీంతో బన్నీ కోసం మంచి కథలు పుట్టుకొస్తున్నాయి, పాన్ ఇండియా దర్శకులు బన్నీని దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. ఈ క్రమంలో బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారింది. పుష్ప 2 తరువాత బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో ఒక మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హారికా హాసిని నిర్మాణంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ముగిశాయని, ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలు జరుపుకుని, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా మైథిలాజికల్ బ్యాక్ గ్రౌండ్ అని నిర్మాత నాగవంశీ తెలిపారు.
త్రివిక్రమ్ తర్వాత జవాన్ ఫేమ్ అట్లీతో ఒక సినిమా ఉంటుందని టాక్. అట్లీ ఇప్పటికే బన్నీ కోసం ఒక పాన్ ఇండియా కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ - రామ్ చరణ్ సినిమా పూర్తయ్యాక 'పుష్ప 3' చేయనున్నాడు. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగతో ఒక మూవీ ఉంటుందని సమాచారం.