నందమూరి నటసింహం బాలకృష్ణకి కాలం కలిసి వచ్చింది. ఇపుడు ఏది చేపట్టినా విజయం వరిస్తోంది. సినిమాల్లో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి, డబుల్ హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నాడు. ఇంకో వైపు రాజకీయాల్లో కూడా హ్యాట్రిక్ కొట్టారు. అన్స్టాపబుల్ షో ద్వారా మంచి హోస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. ఇన్ని చేసినా కానీ నందమూరి ఫాన్స్ లో ఏదో అసంతృప్తి, వెలితి ఉండిపోయింది. కొత్త ఏడాదిలో ఆ వెలితి కూడా తీరి పోయింది. రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది. ఈ లిస్ట్ లో బాలయ్య కూడా ఉన్నారు.
బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. రిపబ్లిక్ డే సందర్భంగా అందించే పద్మా అవార్డ్స్ లో పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లను ప్రకటించింది. ఈ క్రమంలో బాలయ్యకి పద్మ భూషణ్ అవార్డు ప్రకటించటంతో నందమూరి ఫాన్స్, టాలీవుడ్ ఆనందంలో ఉంది. సంబరాలు చేసుకుంటున్నారు. బాలయ్య బాబుకి కళా రంగం కేటగిరిలో పద్మ అవార్డుకు నామినేట్ చేయగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో మూడోది అయిన పద్మ భూషణ్ ప్రకటించింది.
బాలయ్యకి పలువురు, సినీరాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ మధ్యనే బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరిగాయి, ఇప్పుడు పద్మ భూషణ్ అందుకున్నారు. నెక్స్ట్ పద్మ విభూషణ్ కోసం ఫాన్స్ వెయిటింగ్.