మంచు ఇంట్లో పెళ్లి బాజా మోగబోతోంది. ఈరోజే.. మనోజ్ పెళ్లి. రాత్రి 8.30 గం.లకు ముహూర్తం నిర్ణయించారు. ఆ శుభ ముహూర్తాన మనోజ్, భూమా మౌనికా రెడ్డిని దంపతులు కానున్నారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్‌లోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో వీరి పెళ్లి జరగబోతోంది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబ పెద్దలు, కొంతమంది ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరు కానున్నారు. అతి తక్కువమందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. గత కొంతకాలంగా భూమా మౌనిక రెడ్డి, మనోజ్ ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే.
మరోవైపు కథానాయకుడిగానూ మనోజ్ సరికొత్త ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నాడు. పెళ్లయ్యాక... కొత్త సినిమాల కబుర్లు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. `అహం బ్రహ్మస్మి` అనే ఓ ప్రాజెక్టుని మనోజ్ ఇది వరకే పట్టాలెక్కించాడు. ఆ సినిమాకి సంబంధించిన అప్ డేట్ త్వరలో రానుంది.