సంగీతానికి ఎల్లలు లేవు. పాట బావుంటే ఖండాలు దాటిపోతుంది. దానికి తాజా నిదర్శనం ‘అల వైకుంఠపురములో’... బుట్టబొమ్మ. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఇందులో పాటలన్నీ చార్ట్ బస్టర్స్. ‘బుట్టబొమ్మ’ పాట అయితే ఇంకొంచెం ఎక్కువ. ఇప్పుడు ఈ పాట ఖండాలు దాటేసింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ పాటకు మైమరిచిపోయాడు. తన భార్యతో కలిసి ‘బుట్టబొమ్మ’ పాటకి డాన్స్ చేశాడు. ఈ టిక్‌టాక్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది. ఇది చూసిన ‘అల వైకుంఠపురములో' టీం ఆనందంతో బుబ్బితబ్బిబైయింది.
అల్లుఅర్జున్ ఈ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు. ''వావ్.. మేచ్చుకోలేకవుండలేకపోతున్నా''అని ట్వీట్ చేశాడు. సంగీత దర్శకుడు తమన్ అయితే .. ''ఈ లాక్ డౌన్ టైంలో గొప్ప ఎనర్జీ ఇచ్చారు వార్నర్. ఇలా ఎలా ? '' అని ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇదే సంగతి త్రివిక్రమ్ దగ్గరికి వెళ్ళింది. ఆయనకి సోషల్ మీడియా ఎకౌంట్లు లేవు. సన్నిహితుల వద్ద మాత్రం తనదైన శైలిలో ''ఇందులో మన గొప్పదనం లేదు. అంతా పాటకున్న గొప్పదనం'' అని నవ్వేశారట. మొత్తానికి బుట్టబొమ్మ పాట అల.. టీంని ఆనందంతో ముంచేసింది.
Thank you very much. Really Appreciate it . 👍🏼🙏🏼 https://t.co/mPJrlhhkxf
— Allu Arjun (@alluarjun) April 30, 2020