సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో..!

మరిన్ని వార్తలు

'సరిలేరు నీకెవ్వరు..' నుండి సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. 'సూర్యుడివో.. చంద్రుడివో..' అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ వీడియోని రిలీజ్‌ చేశారు. ఈ వీడియో చూశాక మహేష్‌ ఫ్యాన్స్‌కి కడుపు నిండిపోయింది. షూటింగ్‌ సమయంలో జరిగిన సరదా సరదా సన్నివేశాల్ని, సెట్‌లో సందడి వాతావరణాన్ని ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా మహేష్‌బాబు, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు వీడియోలో హైలైట్‌గా నిలుస్తున్నాయి.

 

రామజోగయ్య శాస్త్రి రచించిన లిరిక్స్‌ వినసొంపుగా ఆకట్టుకుంటున్నాయి. వీడియోలోని విజువల్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌ని అలరిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారధ్యంలో వచ్చిన ఈ లిరికల్‌ వీడియో ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించడం ఖాయం. మొన్న విడుదలైన టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇక లేటెస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ ఎలాంటి సంచలనాలు సృష్టించనుందో చూడాలిక. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS