మన దేశానికి, అందునా మన తెలుగు పాటకు ఆస్కార్ వచ్చింది. ఓరకంగా... తెలుగువాళ్లకు ఇది మరో పండగ. అందుకే...సోమవారం అంతా ఆస్కార్ హడావుడి కనిపించింది. ఎక్కడ చూసినా ఇదే మాట. సినిమా సెలబ్రెటీలైతే.. ఆస్కార్ సాధించినందుకు ఆర్.ఆర్.ఆర్‌నీ, అందుకు కారకులైన టీమ్ ని ఆకాశానికి ఎత్తేస్తూ పోస్టులు పెట్టారు. చిన్నా పెద్దా తేడా లేదు. అందరి ఫేస్‌బుక్, ట్విట్టర్ ఎకౌంట్లు ఆర్.ఆర్.ఆర్ జపం చేశాయి.
కానీ... అల్లు అర్జున్ నుంచి మాత్రం ఎలాంటి సందేశాలూ రాలేదు. దాంతో.. మెగా అభిమానులు ఇంకోసారి అల్లు అర్జున్ వైపు అనుమానంగా చూశారు. `మేటర్ ఏమయ్యుంటుంది` అని ఎవరి ఊహల్లో వాళ్లు తేలిపోయారు. మొత్తానికి ఇప్పుడు బన్నీ నుంచి రియాక్షన్ వచ్చింది. ఒక రోజు ఆలస్యంగా ఆర్.ఆర్.ఆర్ పై స్పందించాడు. అయితేనేం.. టీమ్ మొత్తంపై తన ప్రేమ చూపించాడు. కీరవాణి, చంద్రబోస్‌లకు శుభాకాంక్షలు చెబుతూ... బై బ్రదర్.. `గ్లోబర్ స్టార్` రామ్ చరణ్ అంటూ చరణ్‌ని సంబోధించాడు. తెలుగు సినిమా ప్రైడ్.. అంటూ ఎన్టీఆర్‌కి శుభాకాంక్షలు తెలిపాడు.
రాజమౌళితో పాటు మిగిలిన టీమ్ సభ్యులకు బన్నీ తన శుభాకాంక్షలు తెలియజేశాడు. కాస్త లేట్ గా అయినా.. బన్నీ స్పందించడం సంతోషం. కాస్త ముందే తన స్పందన తెలిపి ఉంటే.. మెగా ఫ్యాన్స్ కీ, బన్నీకీ మధ్య ఈమత్రం గ్యాప్ కూడా వచ్చేది కాదు.