ఇప్పుడన్నీ పాన్ ఇండియా సినిమాలే. స్టార్ హీరో సినిమా అంటే... తెలుగుతో పాటు తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేసేయాల్సిందే. మార్కెట్ పరంగా క్రేజ్ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఇదొకటి. దాదాపు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అల్లు అర్జున్ చేస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా `పుష్ష`. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ష 1.. డిసెంబరు 17న విడుదల అవుతోంది. ఈలోగా... ఈ సినిమా ప్రమోషన్లు మొదలైపోయాయి.
ఇప్పుడు పుష్షకి సంబంధించి, ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ తన బహు భాషా చాతుర్యాన్ని ప్రదర్శించబోతున్నాడని టాక్. తెలుగులో బన్నీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. ఇప్పుడు కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోనూ తన గొంతే వినిపించాలని చూస్తున్నాడట. బన్నీకి తమిళం బాగా వచ్చు. మలయళం కొంచెంకొంచెం వచ్చు. కన్నడ పూర్తిగా రాదు. అయినా సరే, నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పాలని భావిస్తున్నాడట. హిందీ కి డబ్బింగ్ చెప్పే ఛాన్స్‌మాత్రం మరొకరికిఇస్తున్నట్టు టాక్.