అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. దానికి ఒక్క రోజు ముందు మహేష్ సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' థియేటర్లలో సందడి చేయబోతోంది. మొదటి రోజు మహేష్ సినిమా, రెండో రోజు అల్లు అర్జున్ సినిమా.. అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద ఇంపాక్ట్ చాలా గట్టిగా పడుతుంది. థియేటర్లు అల్లు అర్జున్ సినిమాకి ఎంతవరకు దొరుకుతాయి.? అన్నది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాపై బజ్ మామూలుగా లేదు. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా, 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాని థియేటర్ల నుంచి తీసే ప్రసక్తి వుండదు.
ఈ ఆందోళనే అల్లు అర్జున్‌ని డిఫెన్స్‌లో పడేసింది. ఒక రోజు ముందు వచ్చేద్దామా.? అని ఆలోచించాడట. కానీ, కుదరలేదు. ఒప్పందాలు పక్కాగా వున్నాయి. కానీ, వాటి అమలు ఏమవుతుందో తెలియదు. ఇదిలా వుంటే, 'ప్లాన్-బి'ని అల్లు అర్జున్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్‌ని డబుల్ యాక్టివ్ చేస్తున్నారట తెరవెనుకాల. ఎక్కడికక్కడ హంగామా రెట్టింపు చేయాలనీ, ఓపెనింగ్స్ అదిరిపోవాలనీ అభిమానులకు ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తోంది.
అస్సలేమాత్రం నెగెటివ్ టాక్ స్ప్రెడ్ కాకుండా చూసేందుకూ ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇదిలా వుంటే, 'సరిలేరు నీకెవ్వరూ' ఈవెంట్‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవడం అల్లు అర్జున్ అభిమానులకి కాస్త ఇబ్బందిగా మారింది. ఏదిఏమైనా, సంక్రాంతి సీజన్.. అంటే సినిమాలకీ పండగే. టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్ళు సాధిస్తుంటాయి. పైగా, రెండు సినిమాల మీదా బజ్ ఓ దాదాపు ఈక్వల్‌గానే వుంది. సో, అల్లు అర్జున్ అభిమానులు మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదేమో.!