మహేష్, ప్రభాస్ లని వెనక్కి నెట్టిన పుష్ప రాజ్

మరిన్ని వార్తలు

ఆదివారం పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ పాట్నాలో నిర్వహించగా రికార్డ్ స్థాయిలో జనాలు ఈ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు. బన్నీ కి నార్త్ లో ఉన్న క్రేజ్ తో పాటు పుష్ప సినిమాపై ఆడియన్స్ కి ఎంత ప్రేమ ఉందో ఈ ఈవెంట్ తెలిపింది. ఇండియాలోనే బిగ్గెస్ట్ ఈవెంట్ గా పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ నిలిచింది. ఇంకో వైపు 500 కోట్లు బడ్జెట్ పెట్టిన ఈ మూవీకి రిలీజ్ కి ముందే 1100 కోట్లు రావటం గమనార్హం. రిలీజ్ కి ముందే పుష్ప రాజ్ రికార్డ్స్ కొల్లగొడుతున్నాడు. ట్రైలర్‌ రిలీజ్ లోనూ రికార్డ్ సాధించి తగ్గేదేలే అని నిరూపించాడు బన్నీ.

ఎప్పటినుంచో ఫాన్స్ పుష్ప రాజ్ చేసే విధ్వంసాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నారు ఫాన్స్. ఆగస్టు లో రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి వాయిదా పడింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అవటం తో ఫాన్స్ పూనకాలు లోడింగ్ అంటున్నారు. పుష్ప 2 ట్రైలర్‌ రిలీజైన కొన్ని క్షణాల్లోనే మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్‌తో సౌత్‌ ఇండియాలో రికార్డ్ క్రియేట్ చేసాడు బన్నీ. అన్ని భాషల్లోనూ పుష్ప 2 ట్రైలర్‌ ట్రెండ్‌ అవుతోంది. సౌత్‌ సినిమాల ట్రైలర్స్‌కి నార్త్‌ లో పెద్దగా రెస్పాన్స్ ఉండదు. కానీ ఈ ట్రైలర్‌కి మాత్రం విపరీతంగా స్పందన వస్తోంది. కేవలం 15 గంటల్లో ట్రైలర్ 40 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

తెలుగు వర్షన్‌ ట్రైలర్‌కి వచ్చిన వ్యూస్ ఇంతకముందెప్పుడు ఏ ట్రైలర్‌ కి రాలేదని యూనిట్‌  హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పుష్ప-2 ట్రైలర్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌ సాధించినట్లు మేకర్స్‌ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్‌ రిలీజ్ చేసారు. ట్రైలర్‌ వ్యూస్‌ పరంగా టాప్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. అంతే కాదు ఇప్పటివరకు తెలుగు సినిమాల ట్రైలర్లలో 24 గంటల్లోనే ఎక్కువమంది చూసిన ట్రైలర్‌గా మహేష్‌ బాబు 'గుంటూరు కారం' నిలవగా, ప్రభాస్‌ 'సలార్‌' సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. ఇప్పుడు పుష్ప-2 ట్రైలర్‌ ఈ రెండిటిని వెనక్కి నెట్టి టాప్‌ 1 లో చేరింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS