అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష`. రష్మిక కథానాయిక. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదలచేస్తున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1ని - డిసెంబరు 17న విడుదల చేయడానికి చిత్రబృందం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
సుకుమార్ సినిమా అంటే.. ఐటెమ్ సాంగ్ మస్ట్. ఇది వరకు దేవిశ్రీ - సుకుమార్ కాంబోలో వచ్చిన అన్ని ఐటెమ్ గీతాలూ సూపర్ హిట్టయ్యాయి. అదే.. సెంటిమెంట్ తో ఈ సినిమాలోనూ ఓ ఐటెమ్ గీతాన్ని కంపోజ్ చేశారు. ఆ పాటలో నర్తించే కథానాయిక ఎవరన్న విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. బన్నీ పక్కన ఐటెమ్ గాళ్ గా కనిపించే ఛాన్స్ నౌరా ఫత్రీకి దక్కింది. ముందుగా ఈ పాట కోసం దిశా పటానీని అనుకున్నారు.కానీ చివరి నిమిషాల్లో... నౌరా టీమ్ లోకి వచ్చి చేరింది. ఇప్పటికే దేవిశ్రీ పాట సిద్ధం చేసేశాడు. ఇక చిత్రీకరణే బాకీ. టాకీ దాదాపుగా పూర్తి కావొచ్చిందని సమాచారం. ఐటెమ్ గీతంతో సహా మూడు పాటల్ని తెరకెక్కించాల్ట. ఈ నెలాఖరు నాటికి పాటల్ననీ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు సుకుమార్. మరి ఈ ఐటెమ్ గీతాన్ని ఎప్పుడు తెరకెక్కిస్తారో?