తెలుగులో వచ్చిన మొట్ట మొదటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్... ఆహా. తెలుగు ప్రేక్షకులకు వెబ్ సిరీస్‌ల రుచి చూపించింది. టాక్ షోలూ నిర్వహించింది. ఇప్పుడు మరో టాక్ షోతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైంది. ఈ టాక్ షో కి హోస్ట్ ఎవరో తెలుసా? నందమూరి బాలకృష్ణ.
అల్లు అరవింద్ నేతృత్వంలోనే ఆహా..లో బాలయ్య ఓ టాక్ షో చేయడం నిజంగా మంచి ఐడియానే. బాలకృష్ణ ఇంటర్వ్యూలకు యూ ట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉంటాయి. ఆయనే మరో సెలబ్రెటీని ఇంటర్వ్యూ చేస్తే.. ఇంకెంత హంగామా ఉంటుందో కదా? ఈ ఐడియాతోనే ఆహా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్టార్ హీరోలు ఈమధ్య బుల్లి తెరపై సందడి చేయడం, ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై కాలు పెట్టడం సహజంగా మారిపోయింది. ఆ జాబితాలో ఇప్పుడు బాలకృష్ణ కూడా చేరినట్టైంది. ఈ షో కోసం బాలయ్యకు భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వబోతున్నార్ట. ఒక్కో ఎపిసోడ్ కీ దాదాపుగా 50 నుంచి 70 లక్షల వరకూ పారితోషికం ఉండబోతోందని టాక్. త్వరలోనే ఈ టాక్ షోకి సంబంధించిన వివరాలు బయటకు వస్తాయి.