బన్నీ 'సూర్య'లో హీరోయిన్‌ ఎవరు?

మరిన్ని వార్తలు

బన్నీ తాజాగా 'డీజె'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా విజయవంతంగా దూసుకెళ్లిపోతోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే బన్నీ కొత్త సినిమాని లైన్‌లో ఉంచాడు. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రచయితగా పలు విజయవంతమైన చిత్రాలను అందించాడు వక్కంతం వంశీ. ఈ సినిమాతో తొలి సారిగా మెగా ఫోన్‌ పట్టనున్నాడు వక్కంతం వంశీ. లగడపాటి శిరీషా శ్రీధర్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. హై టెక్నికల్‌ వేల్యూస్‌తో సినిమాని తెరకెక్కించనున్నారు. అయితే ఈ సినిమాలో బన్నీ సరసన చిందేసే ముద్దుగుమ్మ ఎవరనే విషయంపై చర్చ జరుగుతోంది. కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనుందని ఈ మధ్య ప్రచారం బాగా జరుగుతోంది. ఇటీవలే పరిచయమై కన్నడలో సెక్సస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది ముద్దుగుమ్మ రష్మిక. యాక్టింగ్‌ టాలెంట్‌ ఉన్న బ్యూటీ. అందుకే ఎంట్రీకి ముందే టాలీవుడ్‌లో కూడా పాపులర్‌ అయిపోయింది. అయితే తాజాగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. 'జెంటిల్‌మెన్‌' సినిమాతో నటనలో మంచి మార్కులేయించుకున్న బ్యూటీ నివేదా థామస్‌. అందానికి అందం, అభినయానికి అభినయం.. ఈ బ్యూటీ అయితేనే ఈ సినిమాకి బాగుంటుందనీ, బన్నీకి సరిజోడీ ఈ భామే అంటే ప్రస్తుతం టాక్‌ వినిపిస్తోంది. ఏమో బన్నీతో జత కట్టే ముద్దుగుమ్మ ఎవరో కానీ.. అతి త్వరలోనే హీరోయిన్‌ ఎంపికపై చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వనుంది. అంతవరకూ ఈ సస్పెన్స్‌ ఇంతే!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS