రానా హీరోగా తెరకెక్కుతోన్న సినిమా 'నేనే రాజు నేనే మంత్రి'. ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో మంచి వ్యూస్ అందుకుంటోంది. మొదట్లో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోలేదు. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ తేజ. కానీ ఈ మధ్య తేజ సినిమాలు అంతగా ఆదరణ పొందడం లేదన్న మాట వాస్తవమే. అందుకే సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్నాడు తేజ. ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత తేజ నుండి వస్తోన్న సినిమా 'నేనే రాజు నేనే మంత్రి'. డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఈ మధ్య జోరు మీదున్నాడు రానా. రానా హీరోగా ఈ సినిమాను ఎంచుకున్నాడంటేనే ఈ సినిమాలో విషయం ఉన్నట్లే అనిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఫస్ట్‌లుక్ వచ్చినప్పట్నుంచీ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. ఇక ట్రైలర్ వచ్చాక ఆ అంచనాలు పదింతలయ్యాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో వస్తోన్న సినిమా ఇది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తేజ సంధిస్తున్న అస్త్రంగా అభివర్ణిస్తున్నారు ఈ సినిమాని. రానా పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ స్ట్రేచర్‌తోనే రానా ఈ సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. అలాగే చందమామ భామ కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. కాజల్ పాత్ర పేరు రాధ. రానా పాత్ర పేరు జోగేంద్ర. 'రాధ లేకుండా జోగేంద్ర లేడు..' అని రానా చెబుతున్న డైలాగ్‌ని బట్టి కాజల్ పాత్రకు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ చాలా బాగుంటుందంటూ టాక్ వినిపిస్తోంది. మరో ముద్దుగుమ్మ కేథరీన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.