నయనతార పేరు వింటేనే బన్నీ ఫాన్స్ మండిపడతారు. అల్లు అర్జున్ , నయన్ కాంబినేషన్‌లో ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రాలేదు. ఇక ముందు రాదు కూడా అంటున్నారు బన్నీ ఫాన్స్. కారణం ఒక పబ్లిక్ ఈవెంట్‌లో అల్లు అర్జున్ ను నయనతార అవమానించింది. నానుమ్ రౌడీ ధాన్ మూవీ 2015 లో వచ్చింది. ఇందులో విజయ్ సేతుపతి, నయనతార జంటగా నటించారు. ఈ మూవీ తెలుగులో “నేనూ రౌడీనే” అనే పేరుతో వచ్చింది. కోలీవుడ్ హీరో ధనుష్ దీన్ని14 కోట్లతో నిర్మించగా,31 కోట్లు వసూల్ చేసింది. ఈ మూవీలో నయనతార యాక్టింగ్ కి మంచి పేరు వచ్చింది. ఆమె నటనకు చాలా అవార్డ్స్ వచ్చాయి.
ఓ ఫంక్షన్ లో ఈ సినిమాకు గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును నయనతారకి ఇవ్వడానికి స్టేజి మీదకి అల్లు అర్జున్ వచ్చాడు. ఆ సమయంలో నయనతార బన్నీ చేతులమీదుగా కాకుండా తనకు కాబోయే భర్త విగ్నేష్ శివన్ చేతుల మీదగా ఈ అవార్డు తీసుకోవాలనుకుంటున్నానని అందరి ముందే చెప్పింది . ఇది ఎవరికైనా కొంచెం ఇబ్బంది కలిగించే అంశమే. దానివల్ల అల్లు అర్జున్ బాధపడాల్సి వచ్చింది. ఫాన్స్ కూడా చాలా మండిపడ్డారు. 2016 లో జరిగిన ఈ సంఘటన కోలీవుడ్, టాలీవుడ్ లో పెద్ద దుమారమే రేపింది.
అయితే ఆ రోజు జరిగిన అవమానాన్ని బన్నీ ఇప్పటికీ మర్చిపోలేదట. నేషనల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ అయిన బన్నీ సరసన నటించటానికి ప్రస్తుతం హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే నయన్ కూడా బన్నీ తో ఒక సినిమాకి ఓకే చెప్పిందని, బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్ధమయ్యిందని టాక్. కానీ బన్నీ మాత్రం నయనతార పేరు వినగానే ఆమె సినిమాలో ఉంటే నేను సినిమా చెయ్యను అని చెప్పినట్టు గా గుసలు వినిపిస్తున్నాయి. అట్లీ బన్నీ కాంబోలో రానున్న మూవీలో నయన్ ని సంప్రదించి ఉండొచ్చు. అట్లీ రీసెంట్ బ్లాక్ బ్లస్టర్ 'జవాన్' లో నయన్ తార హీరోయిన్ గా చేసింది. అందుకే అట్లీ తన నెక్స్ట్ మూవీలో నయన్ ని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. కానీ బన్నీ నో చెప్పాడని టాక్.