అంబాజీపేట... 3 రోజుల వసూళ్లు

మరిన్ని వార్తలు

కమెడియన్ సుహాస్, శివాని జంటగా నటించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ  ఫిబ్రవరి 2న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. రిలీజ్ కి ముందు రోజు వేసిన  ప్రీమియర్ షో నుంచే పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.  సుహాస్, శరణ్య యాక్టింగ్ కి అందరూ ఫిదా అయిపోయారు. ఇందులో కామెడీతో పాటు, ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాతో సుహాస్ హీరోగా హ్యాట్రిక్ కొట్టాడు.


అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమా మొదటి రోజే 2.28 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, రెండు రోజులకు 5.16 కోట్లు కలెక్ట్ చేసింది. సండే కూడా  హాలిడే కావడంతో మూడో రోజు కూడా కలెక్షన్స్ బాగా వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల్లో  8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఆల్మోస్ట్ అన్నిచోట్లా బ్రేక్ ఈవెన్ అయింది.  అమెరికాలో కూడా ఇప్పటికే 100K డాలర్స్ వసూలు చేసింది ఈ సినిమా. అంబాజీపేట మ్యారేజి బ్యాండు వన్ వీక్ లోనే ఈజీగా 10 కోట్ల కలెక్షన్స్ దాటేస్తుందని భావిస్తున్నారు.  ఈ మూవీని  జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా  నిర్మించారు. 


సుహాస్ కెరీర్ స్టార్టింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి 'అతిధి' అనే షార్ట్ ఫిల్మ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. కలర్ ఫోటో సినిమాతో  హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ మూవీతో మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS