ఈ టైటిల్ చూసి అల్లు అర్జున్ ఏదైనా స్టోర్ ప్రారంబించనున్నాడా లేక ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడా అని అనుకోకండి.
వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ త్వరలోనే స్వంతంగా ఒక నిర్మాణ సంస్థని మొదలుపెట్టబోతున్నాడట. ఇప్పటికే ఆయన తండ్రి వద్ద గీత ఆర్ట్స్, GA2 పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థలు ఉండగా మళ్ళీ ప్రత్యేకంగా బన్నీ ఒక కొత్త నిర్మాణ సంస్థని ప్రారంబించనుండడం గమనార్హం.
ఈ సంస్థలో తొలి సినిమాలో ఆయనే నటిస్తాడట, ఆ చిత్రాన్ని అనూప్ రెడ్డి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడు అని సమాచారం. ఇదిలావుండగా ఈ చిత్రంలో బన్నీ ఒక బాక్సర్ పాత్రలో కనువిందు చేయనున్నాడట.
మొత్తానికి మెగా నిర్మాత అయిన అల్లు అరవింద్ వారసుడిగా సినీ నిర్మాణంలో సైతం అడుగుపెట్టనున్నాడు అల్లు అర్జున్.