హాస్యనటులకి చిరు ‘మెగా’ సాయం

మరిన్ని వార్తలు

సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకులకి ఎంతో వినోదాన్ని పంచిన గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలు ప్రస్తుతం ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారు.

ఈ విషయం మెగాస్టార్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే మా అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీరాజాని తన ఇంటికి పిలిపించి వారివురికి చెరో 2 లక్షలు ఇవ్వమని చెప్పి ఆ డబ్బుని మెగాస్టార్ ఇచ్చి పంపించారట. అక్కడి నుండి వారు నేరుగా వారిరువురి దగ్గరికి వెళ్ళి ఆ సంబంధిత చెక్కులని వారికి అందచేశారు.

ఈ విషయాన్నీ మా అధ్యక్షుడు శివాజీరాజా నే స్వయంగా మీడియాకి తెలిపారు. అంతేకాకుండా సినీ పరిశ్రమలో ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వచ్చి తనని కలవమని చెప్పారు అని కూడా ఈ సందర్భంగా శివాజీరాజా తెలిపాడు. 

ఈ మధ్యనే ప్రముఖ జర్నలిస్ట్, PRO అయిన పసుపులేటి రామారావుగారు దర్శకరత్న దాసరి గారి పైన రాసిన పుస్తకాన్ని కూడా ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా ఆవిష్కరించడం చూశాం.

మొత్తానికి మెగా స్టార్ ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా ఆదుకునే ఆపద్బాంధవుడులా కనిపిస్తున్నాడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS