పవన్ ఫ్యాన్స్ బన్నీపై గుర్రుగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా బన్నీపై నెగిటివ్ కామెంట్స్ సంధిస్తున్నారు పవన్ అభిమానులు. ఓ మెగా ఫంక్షన్‌లో పవన్ కోసం ఫ్యాన్స్ ఆడిగినందుకు ఓ సారి బన్నీ క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ పవన్ ఫ్యాన్స్ బన్నీకి యాంటీ అయిపోయారు. కానీ పవన్ అంటే బన్నీకి ఎంతో అభిమానం. పలు మార్లు తన అభిమానాన్ని చాటుకున్నారు కూడా బన్నీ. అయినా కానీ ఫ్యాన్స్ మాత్రం బన్నీని వదిలి పెట్టడం లేదు. అందుకే బన్నీ ఇక ఈ వివాదాలకి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నాడట. అందుకు సరైన వేదిక కోసం బన్నీ ఎదురు చూస్తున్నాడట. వేదిక సెట్ కాగానే బన్నీ తన మనసులోని మాటను బయట పెట్టి, పవన్ ఫ్యాన్స్‌లో మెదిలిని ఈ అలజడిని తగ్గిస్తాడేమో. వారి కోపాన్ని చల్లారుస్తాడేమో చూడాలి. ప్రస్తుతం బన్నీ 'దువ్వాడ జగన్నాధమ్' సినిమాలో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. బహుశా ఈ సినిమాకి సంబంధించిన ఫంక్షన్‌లోనే బన్నీ తన నిర్ణయాన్ని తెలియపర్చనున్నాడు కాబోలు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఈ సినిమా. ఇటీవల విడుదలైన టీజర్‌తో బన్నీ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా భలే బాగున్నాడు. ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షుల ముందుకు రానుంది.