చిరంజీవి రీ ఎంట్రీలో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150'తో రికార్డులు కొల్లగొట్టేశాడు. తాజాగా 151వ చిత్రానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సినిమాకి సర్వం సిద్ధమైపోయింది. చిరంజీవి చేయబోయే 151వ చిత్రం 'ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి'. ఇది గుర్తింపు దక్కని మరుగున పడిపోయిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత గాధ. ఈ యదార్ధ చరిత్రలో నటించబోతున్నాడు చిరంజీవి. అందుకోసం చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడట కూడా. అంతేకాదు ఓ ప్రత్యేక టీం ఉయ్యాలవాడ జీవిత చరిత్రకి సంబంధించి అధ్యయనం చేసి, విలువైన సమాచారాన్ని సేకరించి ఉంచారట. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, పరుచూరి బ్రదర్స్ కథని ప్రిపేర్ చేస్తున్నారు. ఈ సినిమాలో నటించాలని చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. కాగా ఈ సినిమాలో చిరంజీవి లుక్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో హాల్‌చల్ చేస్తోంది. చేతిలో గొడ్డలి, బ్యాక్‌గ్రౌండ్‌లో చిరంజీవి ఫోటో లైట్‌గా కనిపిస్తున్నాయి. ఇదే చిరంజీవి తాజా చిత్రం ఫస్ట్ లుక్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇది ఎంత నిజమో తెలీదు కానీ, లుక్ మాత్రం అదిరిపోతోంది. రామ్ చరణ్ నిర్మాణంలోనే ఈ సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్ వివరాలు తొందర్లోనే తెలయనున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.