బన్నీ - సుకుమార్‌ కాంబో: డిజైన్లు అదిరిపోయాయ్‌.!

మరిన్ని వార్తలు

'అల వైకుంఠపురములో..' సినిమా తర్వాత బన్నీ చేయబోయే చిత్రం సుకుమార్‌ డైరెక్షన్‌లో ఉండబోతోందని అధికారిక ప్రకటన ఎప్పుడో వెలువడిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్‌మెంట్‌కి ఇప్పుడు బలం చేకూరింది. తాజాగా సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. హల్‌చల్‌ చేయడమే కాదు, ఏకంగా ట్రెండింగ్‌లోకి వచ్చేశాయి. విజయ్‌ సేతుపతి, బన్నీ కాంబినేషన్‌లో డిజైన్‌ చేసిన పోస్టర్లు, సుకుమార్‌, బన్నీ కాంబో ప్యాక్‌ డిజైన్లు.. ఇలా అద్భుతమైన డిజైన్లలో పోస్టర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి.

 

ఏమాటకామాటే చెప్పుకోవాలి పోస్టర్లు అయితే అదిరిపోయాయ్‌ ఒరిజినల్‌కి ఏమాత్రం తీసిపోవు అన్నట్లున్నాయంతే. ఇవన్నీ ఫ్యాన్‌ మేడ్‌ డిజైన్డ్‌ పోస్టర్లే. రేపే సినిమా లాంఛింగ్‌ అంటూ ఈ పోస్టర్లపై రాసుంది. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో విలన్‌ పాత్ర పోషిస్తున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే, చిత్ర యూనిట్‌ నుండి ఎలాంటి ప్రకటనా రాలేదు. కానీ, ఈ లోగానే ఫ్యాన్స్‌ హడావిడి మొదలైంది. వాస్తవానికి సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది స్కిప్‌ అవ్వడంతో, బన్నీతో సెట్‌ అయ్యింది.

 

ఈ సినిమాలో రష్మిక మండన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రష్మిక 'సరిలేరు నీకెవ్వరూ..' అంటూ మహేష్‌బాబుతో రొమాన్స్‌ చేస్తూ బిజీగా గడుపుతోంది. బన్నీ 'అల వైకుంఠపురములో..' అంటూ పూజా హెగ్దేతో రొమాన్స్‌లో బిజీగా ఉన్నాడు. వీరిద్దరూ ఈ రెండు సినిమాలూ పూర్తి చేసుకుని, సుకుమార్‌ సినిమా కోసం రెడీ కానున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS