బాహుబ‌లిని మించిన సీన్‌... బ‌న్నీ సినిమాలో..?

By Gowthami - December 26, 2019 - 10:27 AM IST

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్ - సుకుమార్‌ది సూప‌ర్ డూప‌ర్ కాంబినేష‌న్‌. వీరిద్ద‌రి నుంచి ఆర్య‌, ఆర్య 2 వ‌చ్చాయి. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఇప్ప‌టికే స్క్రిప్టు ప‌నులు పూర్త‌య్యాయి. బ‌న్నీ లేకుండా కొన్ని స‌న్నివేశాల‌ను కూడా తెర‌కెక్కించిన‌ట్టు స‌మాచారం అందుతోంది. కేర‌ళ‌లోని ఎత్తైన జ‌ల‌పాతాల ద‌గ్గ‌ర ఓ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించార్ట‌. జ‌ల‌పాతం అన‌గానే బాహుబ‌లిలోని స‌న్నివేశాలే గుర్తొస్తాయి. బాహుబ‌లిలో రాజ‌మౌళిన ఎత్తైన జ‌ల‌పాతాల్ని, హాలీవుడ్ సినిమాల స్టైల్లో ఔరా.. అన్న‌ట్టు చూపించాడు.

 

ఇప్పుడు అలాంటి స‌న్నివేశ‌మే ఈ సినిమాలోనూ ఉంద‌ని, దాన్ని సుకుమార్ త‌న‌దైన స్టైల్లో.. బాహుబ‌లిని మించిపోయేలా డిజైన్ చేశాడ‌ని, ఈ సినిమాలో బ‌న్నీ ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ ఇదేన‌ని తెలుస్తోంది. బ‌న్నీ లేక‌పోయినా.. జ‌ల‌పాతాల సీన్ తీసేశార‌ని, సీజీలో బ‌న్నీని యాడ్ చేసుకుంటార‌ని తెలుస్తోంది. అల వైకుంఠ‌పుర‌ములో ముగిసిన వెంట‌నే బ‌న్నీ ఈ సినిమా షూటింగులో పాలు పంచుకోబోతున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS