సుకుమార్‌తో సినిమా అంటే చాలా ఎక్కువ టైం పడుతుందన్న వాదన ఉంది. అవును హీరోలు కూడా అదే భావనలో ఉంటారు. ఆ కారణంతోనే 'రంగస్థలం' తర్వాత సుకుమార్‌తో సినిమా చేయాల్సిన మహేష్ బాబు సింపుల్‌గా నో చెప్పేసి, అనిల్ రావిపూడికి కనెక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత చేసేది లేక సుకుమార్ అల్లు అర్జున్‌ని లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు సుకుమార్ ఆలోచనలు మారాయని ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపై సుకుమార్ తన సినిమాల్ని రూపొందించడంలో కాస్త స్పీడు పెంచాలనుకుంటున్నాడని తెలుస్తోంది.
ఆ క్రమంలోనే సుకుమార్ - బన్నీ సినిమాకి సంబంధించి అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసేశాడట. గ్రౌండ్ వర్క్ ఏంటీ.? బన్నీ లేకుండా షూటింగే స్టార్ట్ చేసేశాడనే ప్రచారం కూడా జరుగుతోంది. లొకేషన్స్ ఫైనల్ చేయడం, నచ్చిన లొకేషన్స్‌లో ఆల్రెడీ కెమెరాలు ఫిక్స్ చేసి, షాట్స్ ఓకే చేసేయడం కూడా జరిగిపోయిందట. బన్నీ ప్రస్తుతం 'అల..' సినిమాతో బిజీగా ఉన్న కారణంగా, ఈ లోగా వీలైనన్ని ఇంపార్టెంట్ సీన్లు మెల్లగా కానిచ్చేస్తున్నాడట సుకుమార్.
ఇక 'అల..' షూటింగ్ పూర్తి చేసుకుని, త్వరలోనే బన్నీ కూడా ఈ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడట. ఈ ప్రచారం చూస్తుంటే, నిజమే, సుకుమార్ రూటు మార్చేసినట్లే అనిపిస్తోంది. అంటే, సుకుమార్ - బన్నీ కాంబో మూవీ 2020 సమ్మర్‌లో రిలీజ్‌కి రెడీ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. అంత స్పీడుగా ఉన్నాడట సుకుమార్. ఈ ప్రచారంలో నిజమెంతో కానీ, సుక్కు స్పీడు ఆ రేంజ్‌లో ఉంటే, ఫ్యాన్స్‌కి అంతకన్నా కావాల్సిందేముంటుంది.