స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి ఇప్పుడు అర్జంటుగా ఓ పెద్ద హిట్ కావాలి. 'సరైనోడు' సినిమా వరకూ వరుస విజయాలతో దూసుకెళ్లిన అల్లు అర్జున్ 'డీజె' నుండీ వరుస పరాజయాలే అందుకుంటున్నాడు. దాంతో ఇక 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమా తర్వాత లాంగ్‌గ్యాప్ తీసుకున్నాడు. కొత్త చిత్రం అనౌన్స్ చేయడానికే ఆలోచనలో పడిపోయాడు. ఏ డైరెక్టర్‌తో సినిమా చేయాలనే సందిగ్ధం అల్లు అర్జున్‌ని వెంటాడుతోంది. ఫలానా డైరెక్టర్‌తో అల్లు అర్జున్ సినిమా ఉండొచ్చునట అనే ప్రచారం తప్ప ఇంకా తన తదుపరి సినిమాపై ఓ క్లారిటీకి వచ్చింది లేదు అల్లు అర్జున్.
అయితే అల్లు అర్జున్ ఖాతాలో 'మనం' డైరెక్టర్ విక్రమ్ కుమార్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారు. కానీ వారిలో ఎవ్వరిని ఫైనల్ చేయాలో తేల్చుకోలేకపోతున్నాడు బన్నీ. ఇదిలా ఉంటే, తాజాగా స్టైలిష్ స్టార్ దృష్టిలో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి చేరినట్లు విశ్వసనీయ వర్గాల తాజా సమాచారమ్. గతంలో సురేందర్‌రెడ్డితో అల్లు అర్జున్ 'రేసుగుర్రం' వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
సో సురేందర్‌రెడ్డి వైపే బన్నీ ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం సురేందర్ రెడ్డి సో బిజీ. మెగాస్టార్‌తో 'సైరా నరసింహారెడ్డి' సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఒకవేళ అల్లు అర్జున్ ఓటు సురేందర్‌రెడ్డికే వేస్తే ఇప్పట్లో అల్లు అర్జున్ కొత్త సినిమా లేనట్లే భావించాలి.
'సైరా' పూర్తి చేశాక కానీ సురేందర్‌రెడ్డి మరో ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టలేడు. మరి అల్లు అర్జున్ అంతవరకూ ఫ్యాన్స్‌ని ఆపగలడా.? ఇప్పటికే ఫ్యాన్స్ నుండి ఒత్తిడి బాగా ఎక్కువైంది అల్లు అర్జున్‌కి. అయినా కానీ ఏమాత్రం తొందరపడకుండా, తన నుండి వచ్చే నెక్స్ట్ సినిమా ఖచ్చితంగా హిట్ సినిమానే అవ్వాలని పట్టు పట్టి కూర్చున్నాడట బన్నీ. చూడాలి మరి ఏం చేస్తాడో. ఫ్యాన్స్‌ని ఎలా మేనేజ్ చేస్తాడో.!